మానుగూరు, 16 October
బీప్రజావసరాలయనర్ఎస బీప్రజావసరాలయనర్ఎస సమస్యలు పాలన వైఫల్యాలపై నిరసనగా బీప్రజావసరాలర్ఎస మాజీలో జిల్లా బ్యూరో గతంలో అక్టోబర్ 16: గతంలో తీసుకెళ్లాల్సింది ప్రజా త
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, మణుగూరు, అక్టోబర్ 16:
మణుగూరు మున్సిపాలిటీలో ప్రజా సమస్యలపై ఈ నెల 23వ తేదీన మహాధర్నా నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో మణుగూరు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం దాదాపు రూ.75 కోట్ల నిధులతో తాగునీటి సౌకర్యాలు, సైడ్ డ్రైన్ల నిర్మాణం, అంతర్గత రహదారులు, ఆహ్లాదకరమైన పార్కులు, పబ్లిక్ జిమ్లు, సెంట్రల్ లైటింగ్ వంటి అనేక ప్రజావసరాల కోసం పనులు తీసుకువచ్చామని ఆయన పేర్కొన్నారు. కానీ నేడు ఆ పనులను రద్దు చేయించి మణుగూరు అభివృద్ధిని అడ్డుకున్న ఘనత ప్రస్తుత ఎమ్మెల్యేకే దక్కుతుందని, ప్రజలకు అవసరమైన పనులను ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి, గతంలో మంజూరైన పనులను రద్దు చేయించడం ప్రస్తుత ఎమ్మెల్యే చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు.











