దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ ఎఫ్‌జెడ్1073 విమానంలో 30 వేల అడుగుల ఎత్తులో తీవ్ర పరిణామం చోటుచేసుకుంది. ఒమన్‌కు చెందిన కో-పైలట్ భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేయడంతో విమానం అదుపుతప్పి వేగంగా కిందకు దిగడం ప్రారంభించింది. ప్రయాణికుల చాకచక్యంతో 174 మంది సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నారు.
విమానం సుమారు 30 వేల అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో ఒమన్‌కు చెందిన కో-పైలట్, భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఈ దాడిలో కెప్టెన్ తీవ్రంగా గాయపడ్డారు. విమానం ఒక్కసారిగా అదుపుతప్పి వేగంగా కిందకు దిగడం ప్రారంభించింది. సుమారు రెండు నిమిషాల్లోనే విమానం వేల అడుగుల ఎత్తును కోల్పోయినట్లు సమాచారం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ మచ్చర్ కాక్‌పిట్ తలుపును అన్‌లాక్ చేయగలిగారు. దీంతో ప్రయాణికులు లోపలికి వెళ్లేందుకు అవకాశం ఏర్పడింది. విమానంలో ఉన్న యానివ్ హయున్, డాక్టర్ షోటా ముసయేవ్, అస్సాఫ్ రజువాన్, జ్వికా మాన్స్ వెంటనే స్పందించారు. వీరిలో కొందరు కో-పైలట్‌ను అదుపులోకి తీసుకోవడంలో కీలకంగా వ్యవహరించగా, దంత వైద్యుడు డాక్టర్ ముసయేవ్ గాయపడిన కెప్టెన్‌కు ప్రాథమిక వైద్యం అందించి రక్తస్రావాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించారు.











