ఆధార్ కార్డులో పేరు మార్చుకోవాలనుకునే వారికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా () కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆధార్‌లో పేరు మార్పు అభ్యర్థనలను మరింత క్రమబద్ధంగా పరిశీలించేందుకు ప్రత్యేక ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్ఓపీ)ను జారీ చేసింది. అధికారిక సర్క్యులర్ల జాబితాలో ఈ ఎస్ఓపీని అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది.
కొత్త విధానం ప్రకారం ఆధార్‌లో పేరు మార్పు చేసే సందర్భాన్ని బట్టి వేర్వేరు పత్రాలు, ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా డేటా నమోదు సమయంలో జరిగిన పొరపాట్లు, పెళ్లి తర్వాత ఇంటిపేరు మార్పు, విడాకుల అనంతరం పేరు మార్పు వంటి సందర్భాలకు ప్రత్యేక ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. ఇటువంటి మార్పులను ధృవీకరించేందుకు సంబంధిత గుర్తింపు పత్రాలతో పాటు అవసరమైన సందర్భాల్లో అఫిడవిట్ వంటి పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని తాజా మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పేరు మార్పుకు పరిస్థితిని బట్టి పత్రాలు
ఆధార్‌లో పేరును సవరించేటప్పుడు మార్పుకు కారణాన్ని బట్టి తగిన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. పేరు స్పెల్లింగ్‌లో పొరపాటు, పేరు విస్తరణ లేదా సంక్షిప్త రూపం, ఇంటిపేరు చేర్చడం లేదా తొలగించడం వంటి మార్పులకు సంబంధిత గుర్తింపు పత్రాలను పరిశీలిస్తారు.











