ఆసియా క్రీడలు2026 పురుషుల క్రికెట్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. జపాన్‌లోని నిషిన్ నగరంలోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో న ఈ స్వర్ణ పతక పోరు జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
సెమీఫైనల్లో భారత్ అద్భుత ప్రదర్శనతో శ్రీలంకపై 124 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 169/7 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ 46 బంతుల్లో అజేయంగా 80 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారత బౌలర్లు శ్రీలంకను 45 పరుగులకే ఆలౌట్ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మరో సెమీఫైనల్లో పాకిస్థాన్ వర్షం కారణంగా కుదించిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు వచ్చింది. బంగ్లాదేశ్ 13 ఓవర్లలో 111/7 పరుగులు చేయగా, పాకిస్థాన్ 11.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.











