**అన్నమయ్య
అన్నమయ్య జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు నామినేషన్ల పరిశీలన కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నామినేషన్ల పరిశీలన సందర్భంగా అధికారులు, అభ్యర్థులు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా విధులు నిర్వర్తించేలా పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. పరిశీలన కేంద్రాల పరిసరాల్లో విధులు నిర్వహించే సిబ్బందిని అప్రమత్తం చేశారు. కేంద్రాల వద్ద అనవసరంగా గుమిగూడకుండా ఆంక్షలు విధించారు. ఎన్నికల విధులకు ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టారు.





