హమారా ప్రసాద్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రూసేగం భూమయ్య మాదిగ డిమాండ్ చేశారు. బాన్సువాడ డివిజన్ కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. హమారా ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేసి, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
హమారా ప్రసాద్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రూసేగం భూమయ్య మాదిగ అన్నారు. బాన్సువాడ డివిజన్ కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. హమారా ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేసి, అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాష్ట్ర ప్రభుత్వంలో దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారని, వారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే పదవులు అనుభవిస్తున్నారని తెలిపారు. అలాంటి మహనీయుడిని కించపరిచేలా మాట్లాడిన హమారా ప్రసాద్‌పై దేశద్రోహం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.











