కడప నగరంలోని 25వ డివిజన్ బాలాజీపేటలో తెలుగుదేశం పార్టీకి చెందిన సుమారు 100 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. జిల్లా అధికార ప్రతినిధి జయచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ భాషా వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో శైలజ, సుజాత, రజిని, రమణమ్మ, వసుంధర దేవి, వేణుగోపాల్, సాయి ప్రసాద్, కృష్ణ, వారి కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. హామీల అమలులో జాప్యం, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాటలకే పరిమితం కావడం వల్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని పేర్కొన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ ప్రజలు ప్రస్తుత పాలనను ప్రశ్నిస్తున్నారని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ప్రజల పక్షాన నిలుస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అడుగులు వేస్తున్నారనడానికి బాలాజీపేటలో సుమారు 100 కుటుంబాల చేరికలు నిదర్శనమని అన్నారు.
ఈ జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, జిల్లా కార్యదర్శి రమేష్ రెడ్డి, మహిళా జిల్లా అధ్యక్షురాలు టి పి వెంకట్ సుబ్బమ్మ, 8వ డివిజన్ ఇన్చార్జి శంకరాపురం సింధు, కార్యదర్శి మాస్టర్ అహ్మద్, నాయకులు అబ్దుల్ రావు, అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.









