స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రాజంపేట డీఎస్పీ వెంకట రామయ్య హెచ్చరించారు. నామినేషన్ల ప్రక్రియలో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాజంపేట డీఎస్పీ వెంకట రామయ్య హెచ్చరించారు. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నామినేషన్ పత్రాలను చింపడం, ఇతరులకు ఆటంకం కలిగించడం వంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తప్పవని ఆయన శనివారం తెలిపారు. బైండోవర్ చేయించిన వ్యక్తులు హింసాత్మక ఘటనలకు పాల్పడితే వారిని రిమాండ్‌కు పంపిస్తామని డీఎస్పీ హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి










