జిల్లాలో సోమవారం పర్యటించిన రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లను అభినందించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, వారికి దిశానిర్దేశం చేశారు.
జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోమవారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా . బాలాజీ ఆయనకు ఘనస్వాగతం పలికారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ పర్యటనలో భాగంగా ఏకగ్రీవంగా ఎన్నికైన పలువురు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లను మంత్రి రాంప్రసాద్ రెడ్డి అభినందించి, సత్కరించారు. వారి విజయం పార్టీ బలోపేతానికి సంకేతమని కొనియాడారు.











