జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలను ఆయన జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆర్డీఓ రామ్మోహన్ తో కలిసి పరిశీలించారు.
రేపు ఉదయం 8 గంటల నుంచి జిల్లాలోని 8 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు. ఒక్కో కేంద్రంలో నాలుగైదు మండలాల ఓట్లు లెక్కిస్తారని, ఒకే బ్యాలెట్ బాక్స్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలెట్ పత్రాలు వేయడం వల్ల, తొలుత వాటిని వేరు చేసి, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపును సమాంతరంగా నిర్వహిస్తారని వివరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రత











