ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కుమార్ సాను కుమార్తె, గాయనినటి శానన్ కె. పేరు ప్రస్తుతం బిగ్‌బాస్-20లో వినిపిస్తోంది. ఆమెను ఈ రియాలిటీ షోలో వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా తీసుకురావచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పటివరకు శానన్ కె. లేదా బిగ్‌బాస్ నిర్వాహకుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
దీంతో ప్రస్తుతం ఇది ఊహాగానాలకే పరిమితమైంది. శానన్ కె. అసలు పేరు సనా కుమార్ సాను అని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. ఆమె కుమార్ సాను కుమార్తె. భారత్‌లో జన్మించిన ఆమె లండన్‌లో పెరిగి, ఆ తర్వాత సంగీతం, వినోద రంగంలో తన కెరీర్ కోసం లాస్ఏంజెల్స్కు వెళ్లారు. ఆమె ప్రధానంగా ఆంగ్ల పాప్ సంగీతంతో పాటు భారతీయ సంగీత ప్రభావాలను తన పాటల్లో మిళితం చేస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
శానన్ గివ్ మీ యువర్ హ్యాండ్, రన్, యాంటిడోట్, ఓటీటీ, 9 టు 5, నాట్ మై షేడ్ వంటి పాటలను విడుదల చేశారు. వ్యక్తిగత అనుభవాలు, ఆత్మవిశ్వాసం, సంబంధాలు, భావోద్వేగాలు వంటి అంశాలు ఆమె పాటల్లో కనిపిస్తాయి.











