జిల్లా బుర్రిపాలెం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పేదల కోసం 3 లక్షల ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ఈ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న 3 లక్షల ఇళ్ల నిర్మాణంతో పాటు, దశలవారీగా మరో 6 లక్షల ఇళ్లను మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. దీంతో రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేద కుటుంబాలకు మరింత ప్రయోజనం కలగనుందని అధికారులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గృహ నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బుర్రిపాలెంలో చేపట్టిన గృహ నిర్మాణ కార్యక్రమంలో అత్యాధునిక 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతను ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. సంప్రదాయ నిర్మాణ పద్ధతులతో పోలిస్తే తక్కువ సమయంలో నిర్మాణాన్ని పూర్తి చేయడం, నిర్మాణ ప్రక్రియలో సాంకేతికతను వినియోగించడం వంటి అంశాలపై ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా పరిశీలన జరుగుతోంది. భవిష్యత్తులో భారీ స్థాయిలో గృహ నిర్మాణం చేపట్టే సమయంలో ఇటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు.











