స్వాతంత్య్ర సమరయోధుడు, కేంద్ర మాజీ మంత్రి జి. వెంకటస్వామి (కాకా) జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ప్రజా జీవితంలో వెంకటస్వామి అందించిన సేవలను సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
సింగరేణి బొగ్గు గని కార్మికుల సమస్యలు, హక్కుల కోసం జి. వెంకటస్వామి జీవితాంతం పోరాటం చేశారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం ఆయన నిరంతరం కృషి చేశారని గుర్తుచేశారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడంలో వెంకటస్వామి కీలక పాత్ర పోషించారని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తెలంగాణలోని బొగ్గు గని ప్రాంతాలతో పాటు పేదలు, బడుగు బలహీన వర్గాల సమస్యలపై వెంకటస్వామి ప్రత్యేకంగా దృష్టి సారించారని సీఎం పేర్కొన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకమని అన్నారు. అణగారిన వర్గాలకు రాజకీయ, సామాజిక ప్రాతినిధ్యం కల్పించేందుకు వెంకటస్వామి చేసిన ప్రయత్నాలను స్మరించుకున్నారు.











