తమిళనాడులోని ధారాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక నేపథ్యంలో రాజకీయ వివాదం నెలకొంది. తవెకే అభ్యర్థి పి. సత్యబామా ఎన్నికల ఖర్చుల నిబంధనలు ఉల్లంఘించారని డీఎంకే ఆరోపించింది. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని డీఎంకే ఎన్నికల సంఘాన్ని కోరింది.
తమిళనాడులోని ధారాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక నేపథ్యంలో రాజకీయ వివాదం నెలకొంది. తమిళగ వెట్రి కళగం (తవెకే) అభ్యర్థి పి. సత్యబామా ఎన్నికల ఖర్చుల విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ డీఎంకే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. అభ్యర్థి ఎన్నికల ఖర్చుల లెక్కలను సమగ్రంగా పరిశీలించి, ఆరోపణలు నిజమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎంకే కోరింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ఎస్. ఆస్టిన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఓ వీడియోను పెన్‌డ్రైవ్‌లో సమర్పించినట్లు సమాచారం. ఆ వీడియోలో సత్యబామా ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు రూ.31 కోట్లు ఖర్చు చేసినట్లు మాట్లాడుతున్నట్లుగా వినిపిస్తోందని డీఎంకే పేర్కొంది. అయితే ఆ వీడియో నిజమైనదా, మార్ఫింగ్‌దా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.











