ఆంధ్రప్రదేశ్‌లోని జూనియర్ డాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వైద్య విద్యార్థులు, జూనియర్ వైద్యులకు చెల్లించే స్టైఫండ్‌ను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో వైద్య విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని జూనియర్ డాక్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. వైద్య విద్యార్థులు, జూనియర్ వైద్యులకు చెల్లించే స్టైఫండ్‌ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ఉత్తర్వుల ప్రకారం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులు చేస్తున్న జూనియర్ డాక్టర్ల స్టైఫండ్‌ను 10 శాతం, పీజీ వైద్య విద్యార్థులకు 5 శాతం, సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేస్తున్న వైద్యులకు 3.5 శాతం చొప్పున పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.











