ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తన కాంపాక్ట్ ఎస్యూవీ 3 లో సీఎన్జీ వెర్షన్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ కొత్త మోడల్ న ఆవిష్కృతం కానుంది. పరీక్షల సమయంలో రోడ్డుపై కనిపించిన వాహనం డిజైన్‌కు సంబంధించిన కొన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి.
పెట్రోల్, డీజిల్, విద్యుత్ వెర్షన్లతో ఇప్పటికే అందుబాటులో ఉన్న 3 కు సీఎన్జీ ఎంపికను జోడించడం ద్వారా తక్కువ ఇంధన ఖర్చుతో ఎస్‌యూవీని వినియోగించాలనుకునే వారికి మరో అవకాశం కల్పించాలని కంపెనీ భావిస్తోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
డిజైన్ వివరాలు
పరీక్షల సమయంలో కనిపించిన వాహనంలో వెనుక అద్దంపై సీఎన్జీ స్టిక్కర్ ప్రత్యేకంగా కనిపించింది. మిగతా డిజైన్ విషయాల్లో ప్రస్తుతం ఉన్న 3 మోడల్ లక్షణాలనే కొనసాగించినట్లు తెలుస్తోంది. కనెక్టెడ్ టెయిల్ ల్యాంపులు, వెనుక స్పాయిలర్, రూఫ్ రైల్స్, వెండి రంగు స్కిడ్ ప్లేట్‌తో కూడిన నల్లటి బంపర్ ఇందులో కనిపిస్తున్నాయి.











