రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు మదన్ రాథోడ్ చేసిన పాకిస్థాన్ సంబంధిత వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ తీవ్రంగా స్పందించారు. మదన్ రాథోడ్ ఎలాంటి షరతులు లేకుండా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వివరణలు ఇవ్వడం, మీడియాపై విమర్శలు చేయడం కంటే తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయడమే ముఖ్యమని గెహ్లాట్ పేర్కొన్నారు. జైపూర్‌లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మదన్ రాథోడ్ మాట్లాడుతూ.. అమెరికా, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగితే భారత్ పాకిస్థాన్‌కు మద్దతుగా నిలుస్తుందని, పాకిస్థాన్ పొరుగు దేశమని వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. భారత్పాకిస్థాన్ మధ్య సమస్యలు వచ్చినప్పుడు మాత్రం భారతదేశానికి మద్దతుగా నిలవాలని ఆయన పేర్కొన్నట్లు ఆ వ్యాఖ్యల వీడియోలో కనిపించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కాంగ్రెస్ విమర్శలు
ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో కాంగ్రెస్ నేతలు బీజేపీపై విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్ విషయంలో బీజేపీ అనుసరిస్తున్న వైఖరికి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యాఖ్యలకు మధ్య వ్యత్యాసం ఏమిటని ప్రశ్నించారు. వివాదం పెరగడంతో మదన్ రాథోడ్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను యుద్ధం గురించి మాట్లాడలేదని, క్రికెట్ మ్యాచ్ సందర్భంలో ఉదాహరణగా ఆ మాటలు చెప్పానని స్పష్టం చేశారు.





