జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన గారపాటి దివ్య (23) అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత ఆమె మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లా దేవరపల్లి మండలానికి చెందిన గారపాటి దివ్య జనసేన పార్టీ తరఫున ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేశారు. గురువారం పోలింగ్ పూర్తయిన అనంతరం మధ్యాహ్నం ఆమె అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అక్కడ వైద్యులు చికిత్స అందించిన అనంతరం ఆమె ఆరోగ్యం కొంత మెరుగుపడటంతో గురువారం రాత్రి ఇంటికి తీసుకువచ్చారు. అయితే శుక్రవారం ఉదయం మరోసారి ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు తిరిగి రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దివ్య తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.










