పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు తీవ్రస్థాయికి చేరాయి. ముఖ్యంగా ఒకరిపై మరొకరు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు.
ఇటీవల పంజాబ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ సమస్యను నియంత్రించడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ అంశంపై ఢిల్లీ నాయకత్వం ప్రభావం ఉందంటూ విమర్శించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దీనికి స్పందించిన ఆప్ నేతలు రాహుల్ గాంధీపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఆప్ సోషల్ మీడియా ఖాతా ద్వారా రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యంగ్య పోస్టును ప్రచురించింది.











