రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు తీసుకొచ్చింది. గత ఆరు నెలలుగా రేషన్ సరుకులు తీసుకోని కార్డులను గుర్తించి తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా సుమారు 1.58 కోట్ల మంది లబ్ధిదారుల రేషన్ హక్కులను అక్టోబర్ నుంచి తాత్కాలికంగా నిలిపివేసే ప్రక్రియ ప్రారంభం కానుంది.
అయితే, రేషన్ కార్డులను వెంటనే శాశ్వతంగా రద్దు చేయరు. ముందుగా వాటిని తాత్కాలికంగా నిలిపివేసి, అర్హతను నిరూపించుకునేందుకు లబ్ధిదారులకు మూడు నెలల గడువు ఇవ్వనున్నారు. ఈ సమయంలో ఈ-కేవైసీ (-) పూర్తి చేస్తే కార్డును తిరిగి యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రజా పంపిణీ వ్యవస్థలోని వివరాలను ప్రక్షాళన చేయడం, డూప్లికేట్, మరణించిన, వలస వెళ్లిన లేదా అనర్హులైన లబ్ధిదారులను గుర్తించడం ఈ చర్య లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ఆహార ధాన్యాలు అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే చేరేలా చూడటంతో పాటు, ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలు, వృథాను తగ్గించేందుకు డిజిటలైజేషన్, ఆధార్ అనుసంధానం, ఈ-కేవైసీ వంటి విధానాలను ఉపయోగిస్తున్నారు.











