రాజకీయ విమర్శలు, వ్యంగ్యానికి స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడానికి అది అనుమతి కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను కించపరిచేలా రూపొందించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వీడియోలు, చిత్రాలు, సోషల్ మీడియా పోస్టులను తొలగించాలని సంబంధిత పక్షాలను ఆదేశించింది.
జస్టిస్ మనోజ్ జైన్ శుక్రవారం ఈ మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ (), ఇతరులపై రేఖా గుప్తా దాఖలు చేసిన పరువు నష్టం దావా విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మద్యం విక్రేతగా చూపించారంటూ ఫిర్యాదు
రేఖా గుప్తా దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం, సోషల్ మీడియాలో ప్రచారమైన కొన్ని రూపొందించిన వీడియోలు, చిత్రాల్లో ఆమెను మద్యం విక్రేతగా, హాకర్‌గా, డెలివరీ ఏజెంట్‌గా చూపించినట్లు ఆరోపించారు. హర్ హర్ రేఖా.. ఘర్ ఘర్ ఠేకా అనే పేరుతోనూ అభ్యంతరకర ప్రచారం జరిగిందని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ముఖ్యమంత్రిని కించపరిచేలా, ఆమె వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఈ దృశ్యాలు ఉన్నాయని పేర్కొంటూ వాటిని వెంటనే తొలగించాలని కోరారు.








