సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణాఫ్రికా క్రికెటర్ హెన్రిచ్ క్లాసెన్, తన కుమార్తెతో కలిసి హైదరాబాద్ నగరంలో ఆటోలో ప్రయాణించిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆటోలో క్లాసెన్ తన చిన్నారి కూతురితో సరదాగా వెళ్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన అభిమానులు, నెటిజన్లు అతని సింప్లిసిటీని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఒక స్టార్ ప్లేయర్ ఇంత సాధారణంగా ప్రయాణించడం ఆశ్చర్యం కలిగించిందని పలువురు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
క్లాసెన్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నారు. తన దూకుడు బ్యాటింగ్తో జట్టుకు ఎన్నో విజయాలను అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.












