బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన 23 ఏళ్ల రాజ్యలక్ష్మి అమెరికాలోని టెక్సాస్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఆమె మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
కారంచేడుకు చెందిన రాజ్యలక్ష్మి, కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 2023లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఆమె, టెక్సాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ న్యూహెవెన్లో కంప్యూటర్స్ విభాగంలో ఎం.ఎస్. చదువుతున్నారు. ఇటీవల ఆమె విద్యాభ్యాసం పూర్తయింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
చదువు పూర్తయిన తర్వాత అక్కడే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఆమె అనుకోని విధంగా మరణించడం అందరినీ కలచివేసింది. మరణానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.












