కామారెడ్డి, 13 September
వినాయక చవితి సందర్భంగా మండలం గర్గుల్ గ్రామంలో డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులనే పూజించాలని ఈ సందర్భంగా పలువురు సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులే మేలు గర్గుల్‌లో భక్తిశ్రద్ధలతో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ జిల్లా, సెప్టెంబరు 13: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలం గర్గుల్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర మల్టీ స్పెషలిస్ట్ డెంటల్ క్లినిక్ డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దేవునిపల్లి సీఐ శ్రీధర్, ఎస్సై రంజిత్ ముఖ్య అతిథులుగా హాజరై భక్తులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వినాయక చవితి భక్తి, ఆధ్యాత్మికతతోపాటు సమాజంలో ఐక్యతను చాటే పవిత్ర పండుగ అని పేర్కొన్నారు. విఘ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రజలకు శుభఫలితాలు కలగాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని వినాయకుడిని ప్రార్థించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఇలియాస్ పేర్కొన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారైన విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందన్నారు. సహజ మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించడం ద్వారా భక్తితోపాటు పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని తెలిపారు. ‘భక్తిశ్రద్ధలతో గణనాథుడిని పూజిద్దాం.. ప్రకృతిని పరిరక్షిద్దాం’ అనే సందేశంతో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రతి ఇంటిలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పర్యావరణహితంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చింతల దివ్య రవితేజ గౌడ్, గ్రామ పాలకవర్గ సభ్యులు, మాజీ ఎంపీటీసీ , ఆర్ నర్సింలు,శంకర్ గౌడ్, భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










