ఆంధ్రప్రదేశ్‌లోని బీచ్‌లలో బార్ల ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదాను ఎక్సైజ్ శాఖ ఖరారు చేసింది. ఈ ప్రతిపాదనపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. పైలట్ ప్రాజెక్ట్‌గా విశాఖపట్నం, చీరాల బీచ్‌లలో 12 ప్రాంతాలను గుర్తించారు. అన్ని రకాల మద్యం లభ్యమవుతుందని ఎక్సైజ్ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీచ్‌లలో బార్ల ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదాను ఎక్సైజ్ శాఖ ఖరారు చేసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. ప్రజా సంఘాల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పటికీ, ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పైలట్ ప్రాజెక్ట్‌గా మొదటి విడతలో విశాఖపట్నం, చీరాల బీచ్‌లలో మొత్తం 12 ప్రాంతాలను బార్ల ఏర్పాటు కోసం ఎక్సైజ్ శాఖ ప్రాథమికంగా గుర్తించింది. విశాఖపట్నంలో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఏడు చోట్ల, యారాడ బీచ్ వద్ద ఒక ప్రాంతంలో బార్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. చీరాల తీరంలో నాలుగు ప్రాంతాలను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ఎన్ని చోట్ల బార్లు ఏర్పాటు చేయాలనే తుది నిర్ణయాన్ని సంబంధిత ఎక్సైజ్ అధికారులతో చర్చించి ఖరారు చేయనున్నారు.












