ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిరోధించే దిశగా ఒక కీలక ప్రతిపాదనను పరిశీలిస్తోంది. సాంకేతికత దుష్ప్రభావాల నుండి పిల్లలను రక్షించడమే దీని లక్ష్యం.
సాంకేతికత అభివృద్ధిని ప్రోత్సహిస్తూనే, పిల్లలపై దాని ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో, 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్‌ను నిరోధించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ప్రతిపాదనపై మంత్రి లోకేష్ స్పందిస్తూ, "మంచి ఆలోచనలు వేగంగా వ్యాపిస్తాయి" అని పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఇలాంటి నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. పిల్లల భద్రత దృష్ట్యా ఈ చర్య అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.












