ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచార, పౌర సంబంధాల శాఖ (I&PR)కు ప్రభుత్వ సలహాదారుగా ప్రముఖ కార్టూనిస్ట్ పోచంపల్లి శ్రీధర్ రావును నియమించింది. ఈ పదవికి కేబినెట్ ర్యాంక్ హోదా కల్పించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమాచార, పౌర సంబంధాల శాఖ (I&PR)కు ప్రభుత్వ సలహాదారుగా ప్రముఖ కార్టూనిస్ట్ పోచంపల్లి శ్రీధర్ రావును నియమించింది. ఈ నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. ఈ పదవికి కేబినెట్ ర్యాంక్ హోదా కల్పించడం విశేషం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోచంపల్లి శ్రీధర్ రావు దాదాపు మూడు దశాబ్దాల పాటు 'ఈనాడు' దినపత్రికలో కార్టూనిస్ట్‌గా పనిచేశారు. రాజకీయ, సామాజిక అంశాలపై ఆయన వేసిన కార్టూన్లు పాఠకుల మన్ననలు పొందాయి. ముఖ్యంగా ఎడిటోరియల్ పేజీలో ఆయన కార్టూన్లు విశేష ఆదరణను చూరగొన్నాయి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన అనుభవం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.












