తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్-2026) ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ సూచనలు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, కొత్తగూడెం, నవంబర్ 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, కొత్తగూడెం, నవంబర్ 2: తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్-2026) ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఎస్ఐఆర్-2026 ప్రక్రియ పురోగతి, పెండింగ్ అంశాలు, తుది ఓటర్ల జాబితా ప్రచురణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఐడీఓసీ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
ఏఎస్డీ, డిలీషన్ జాబితాలపై క్షుణ్ణ పరిశీలన
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి





