జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ హెచ్చరిక రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా విమానాన్ని రాజస్థాన్లోని జైపూర్ విమానాశ్రయానికి మళ్లించి అత్యవసరంగా దించారు. ఈ ఘటనతో విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 2030 విమానం బోయింగ్ 787-9 రకానికి చెందినది. ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి వస్తున్న సమయంలో విమానానికి సంబంధించి భద్రతాపరమైన సమాచారం అందింది. దీంతో అధికారులు వెంటనే స్పందించి విమానాన్ని జైపూర్కు మళ్లించినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఉదయం సుమారు 9.35 గంటలకు విమానం జైపూర్ విమానాశ్రయంలో సురక్షితంగా దిగినట్లు సమాచారం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
స్క్వాక్ కోడ్ 7500తో అప్రమత్తమైన అధికారులు
విమానానికి సంబంధించి స్క్వాక్ కోడ్ 7500 నమోదైనట్లు ప్రాథమిక నివేదికలు వెల్లడించాయి. విమానయాన రంగంలో ఈ సంకేతాన్ని హైజాక్ లేదా విమానంలో అక్రమ జోక్యానికి సూచనగా పరిగణిస్తారు. దీంతో భద్రతా సిబ్బంది విమానాన్ని ప్రత్యేక ప్రాంతంలో నిలిపి తనిఖీలు చేపట్టారు. అయితే ఈ సంకేతం ఎందుకు నమోదైందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.






