హైదరాబాద్ నగరంలో భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతుండటంతో హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పరిరక్షణ సంస్థ () కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ () పరిధిలో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ నిర్వాహకులు బోరు నీటిని వాణిజ్య అవసరాల కోసం వెలికితీయకూడదని ఆదేశించింది.
ట్యాంకర్ నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వెలుపల ఉన్న పెరి-అర్బన్ ప్రాంతాల నుంచి మాత్రమే అవసరమైన అనుమతులు తీసుకుని నీటిని సేకరించాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నగరంలోని మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, అమీర్‌పేట్, అశోక్‌నగర్ వంటి ప్రాంతాల్లో పీజీ హాస్టళ్లు, వాణిజ్య సంస్థల కారణంగా నీటికి భారీ డిమాండ్ ఉంది. ఈ ప్రాంతాల్లో ప్రైవేట్ ట్యాంకర్లు పెద్ద ఎత్తున భూగర్భ జలాలను తోడేస్తుండటంతో స్థానిక నివాసితుల బోర్లు ఎండిపోతున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి.






