కామారెడ్డి, 2026-07-29
కమెడడిిలలపోలీసుసూపిటెడెట,ఐపీఎసబుధవసశివనగపోలీససటననుఆకసమికగతనిఖీశుఈసభగపోలీససటననివహణ,ికడులు,సిబబితోసమవశమైపలుకీలకసూనలుశుపిశుభత,సమథవతమైనపోలీసిగ,పసవవటిఅశలపైఆనృటిసిు
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పరిశుభ్రమైన పోలీస్ స్టేషన్ సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది అని, ప్రజాసేవే పోలీసు విధి అని, ప్రతి ఫిర్యాదుకు సత్వర న్యాయం అందించాలని కామారెడ్డి జిల్లా పోలీసు సూపరింటెండెంట్.యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ అన్నారు. బుధవారం ఆయన సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రిసెప్షన్, రైటర్ రూమ్, వివిధ రికార్డులు, సీసీటీఎన్ఎస్ నిర్వహణ, ఇతర విభాగాలను పరిశీలించి సిబ్బందితో సమావేశమయ్యారు. అనంతరం స్టేషన్ పరిసరాలను సందర్శించి పరిశుభ్రత, నిర్వహణపై పలు సూచనలు చేశారు.












