ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా చేరాలంటే ప్రతి ఇంటికీ డిజిటల్ కనెక్టివిటీ అత్యంత కీలకమని, ఏడాదిన్నరలోపు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్టు (ఏబీఎన్‌పీ)లో భాగంగా ఈ లక్ష్యాన్ని చేరుకోనున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వ సేవలు ప్రజలకు సకాలంలో, సులభంగా చేరాలంటే డిజిటల్ కనెక్టివిటీ అనివార్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఏడాదిన్నరలోపు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ లక్ష్య సాధనలో భాగంగా, అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్టు (ఏబీఎన్‌పీ) కింద గ్రామీణ ప్రాంతాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక కీలక సహకార ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రాజెక్టు అమలుకు అవసరమైన మార్గదర్శకాలను నిర్దేశిస్తుంది.












