కామారెడ్డి, 2026-07-24
కామారెడ్డి జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్లో జిల్లా పోలీసు సూపరిటెడెట్ శ్రీ . రాజేష్ చద్ర, ఐపీస్ వార్షిక తనిఖీ నిర్వహిచారు. ఈ సదర్భగా రికార్డులు, కేసుల దర్యాప్తు, సిబ్బది పనితీరు, మౌలిక సదుపాయాలను పరిశీలిచి అధికారులకు కీలక సూచనలు చేశారు.
కామారెడ్డి జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్లో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, కేసుల దర్యాప్తు, సిబ్బంది పనితీరు, మౌలిక సదుపాయాలను పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
బాధితులకు పోలీస్ స్టేషన్లో తక్షణ స్పందనతో పాటు పారదర్శకమైన సేవలు అందించాలని, ప్రజల్లో పోలీసులపై విశ్వాసం మరింత పెరిగేలా వ్యవహరించాలని ఎస్పీ ఆదేశించారు. గ్రామాలు, ప్రధాన రహదారులు, సమస్యాత్మక ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్‌ను పెంచడంతో పాటు నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు.
పాత నేరస్తులు, రౌడీషీటర్లు, అనుమానితులపై నిరంతర నిఘా ఉంచి నేరాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. త్వరలో జరిగే గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళిక రూపొందించి, భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు నాణ్యమైన పోలీసింగ్ అందించడమే లక్ష్యంగా ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర సూచించారు. ఈ తనిఖీలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.











