కామారెడ్డి, 2023-08-31
కామారెడ్డి జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, శోభాయాత్రలను శాంతియుతంగా, భద్రతతో నిర్వహించేందుకు జిల్లా పోలీసులు కీలక మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ మేరకు మండప నిర్వాహకులకు పలు సూచనలు జారీ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, శోభాయాత్రలను శాంతియుతంగా, భద్రతతో నిర్వహించేందుకు జిల్లా పోలీసులు మండప నిర్వాహకులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా కామారెడ్డి కళాభారతి ప్రాంగణంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర (ఐపీఎస్), అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గణేష్ మండపాలను భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా బ్యారికేడ్లు, ఫైర్ సేఫ్టీ పరికరాలతో ఏర్పాటు చేయాలని, విగ్రహాల ప్రతిష్ఠాపనకు ఆన్లైన్ ద్వారా అనుమతులు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్‌కు, ప్రజా రవాణాకు ఎలాంటి అంతరాయం కలగకుండా మండపాలను ఏర్పాటు చేయాలని, పెద్ద విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు, భక్తుల కోసం క్యూలైన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి





