కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వల్ల ఉద్యోగాలు పోతాయనే ఆందోళన అవసరం లేదని, ఈ సాంకేతికత కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఏఐని ఉద్యోగాలకు ముప్పుగా చిత్రీకరించడం సరికాదని, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై యువతలో భయాలు కాకుండా నమ్మకాన్ని పెంచాలని సూచించారు.
హైదరాబాద్‌లో 400 మంది ఉద్యోగుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ర్యాండమ్ ట్రీస్ సంస్థ భారత ప్రధాన కార్యాలయాన్ని ఆయన శనివారం ప్రారంభించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నైపుణ్యాలను పెంచుకోవాలి
ఐటీ రంగంలో వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, ఇప్పటికే ఉన్న నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం, మారుతున్న అవసరాలకు అనుగుణంగా మళ్లీ శిక్షణ పొందడం ద్వారా భవిష్యత్తు అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం, వైద్యం, విద్య వంటి రంగాల్లో ఏఐ విప్లవాత్మక మార్పులకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.












