బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను తీవ్రరూపం దాల్చడంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. కాకినాడ జిల్లాలోని ఉప్పాడ సముద్రతీరంలో అలలు ఉద్ధృతంగా ఎగసిపడుతున్నాయి. తుపాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఉప్పాడకాకినాడ బీచ్ రహదారిపై రాకపోకలను నిలిపివేసి, మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తీరానికి చేరువలో తుపాను
భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, ఉదయం నాటికి అర్నబ్ తుపాను పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడింది. తుపాను కదలికలు, గాలుల వేగాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ తుపాను బాపట్లవిశాఖపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరాన్ని దాటే సమయంలో గంటకు 115125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని హెచ్చరించింది.












