కార్పొరేట్ ప్రపంచంలో పని ఒత్తిడి మరియు టాక్సిక్ మేనేజర్ల మధ్య, ఒక బాస్ చూపించిన మానవత్వం ఇప్పుడు వైరల్‌గా మారింది.
బెంగళూరు కి చెందిన ఒక ఉద్యోగి 10 రోజుల సెలవు తర్వాత తిరిగి సిటీకి చేరుకున్నాడు. సెలవులు ముగియడంతో, బాధ్యతగల ఉద్యోగిగా తన బాస్‌కు మెసేజ్ చేశాడు.
సాధారణంగా, మేనేజర్లు ఉద్యోగులను ఆఫీస్‌కు రాగానే పని పూర్తి చేయాలని కోరుతుంటారు. కానీ, ఈ బాస్ తన ఉద్యోగికి సానుకూలమైన మెసేజ్ పంపాడు.
ఈ చర్య ఉద్యోగికి కొండంత ఉపశమనాన్ని ఇచ్చింది. ఉద్యోగి ఈ చాట్ స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియాలో పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.
నెటిజన్లు ఈ బాస్‌ను 'గ్రీన్ ఫ్లాగ్ లీడర్' గా ప్రశంసిస్తున్నారు, ఇలాంటి మంచి పనులు ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచుతాయని అభిప్రాయపడుతున్నారు.












