పీరియడ్స్ సమయంలో అమ్మాయిల ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ముఖ్యమైన మార్గదర్శకాలను ప్రముఖ గైనకాలజిస్ట్ డా. మానస సాక్షి అందించారు.
పీరియడ్స్ సమయంలో అనేక శారీరక మరియు భావోద్వేగ మార్పులు జరుగుతాయి. ఈ సమయంలో అమ్మాయిలు ఎలా హైజీన్ మెయింటైన్ చేయాలో, నీళ్లు ఎక్కువగా తాగడం ఎందుకు అవసరమో మరియు మరిన్ని విషయాలను డా. మానస సాక్షి వివరించారు.
పీరియడ్స్ సమయంలో చర్మం పరిశుభ్రత, సరైన ఆహారం, మరియు వ్యాయామం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సమయంలో మానసిక ఆరోగ్యం కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ప్రస్తావించారు.
అంతేకాక, పబ్లిక్ టాయిలెట్లు వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టాంపూన్స్ వాడడం, మరియు మెన్స్ట్రువల్ కప్ శుభ్రత వంటి ముఖ్యమైన విషయాలను వివరించారు.
ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించాలని, ఆరోగ్య సమస్యలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి వైద్య నిపుణులను సంప్రదించాలని డాక్టర్ సూచించారు.












