తిరుపతి నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తాతానగర్‌లో నిర్మాణ పనులు జరుగుతుండగా, కాంక్రీట్ తొట్టి హైటెన్షన్ తీగలకు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది.
పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం తాతానగర్‌లో సుందరమూర్తి అనే వ్యక్తికి చెందిన రెండంతస్తుల భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పై అంతస్తులో స్లాబ్ పనుల కోసం కాంక్రీట్ మిషన్ సహాయంతో ఇనుప తొట్టిలో కాంక్రీట్‌ను పైకి చేరవేస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ క్రమంలో కాంక్రీట్ తొట్టి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి అమర్చిన హైటెన్షన్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా విద్యుత్ ప్రవహించి, కార్మికులకు షాక్ తగిలింది. దీంతో అక్కడ పని చేస్తున్న ఇద్దరు కార్మికులు తీవ్ర విద్యుత్ షాక్‌కు గురయ్యారు.












