ప్రజావాణి కార్యక్రమంలో తన ఇబ్బందులను వివరిస్తూ బ్యాటరీ వీల్ చైర్ కావాలని కోరిన బిచ్కుంద మండలానికి చెందిన దివ్యాంగుడు గండ మల్లా గంగాధర్ విజ్ఞప్తికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్పందించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆయనకు బ్యాటరీ వీల్ చైర్ ను అందజేశారు.
ప్రజావాణికి వచ్చిన దివ్యాంగుడు గండ మల్లా గంగాధర్, తన రోజువారీ అవసరాలకు, జీవనోపాధికి ఉపయోగపడేలా బ్యాటరీ వాహనం అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ను కోరారు. ఆయన పరిస్థితిని సానుకూలంగా పరిశీలించిన కలెక్టర్, మరుసటి రోజే కలెక్టరేట్‌కు పిలిపించి బ్యాటరీ వీల్ చైర్ ను అందజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రజల సమస్యలను సానుభూతితో అర్థం చేసుకుని, అర్హులైన వారికి అవసరమైన సహాయం అందించేందుకు జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు, సహాయ సహకారాలు అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.












