హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ప్రముఖ నటుడు బాలకృష్ణ నివాసానికి సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకువచ్చిన నాలుగు కార్లు అదుపుతప్పి పక్కనున్న రోడ్డులోకి దూసుకెళ్లి, పలు బైకులను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు.
అతివేగంగా వచ్చిన కార్లు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వాహనాలను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రమాదంలో నాలుగు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. సంఘటనా స్థలంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు.












