వై.ఎస్.ఆర్ కడప, 10 September
పులివెందుల పట్టణంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సమీపంలోని బైక్ మెకానిక్ షాపు, పక్కనే ఉన్న హార్డ్‌వేర్ షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సుమారు 20 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పులివెందుల పట్టణంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బైక్ మెకానిక్ దుకాణంతో పాటు పక్కనే ఉన్న హార్డ్‌వేర్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి సుమారు గంటపాటు శ్రమించారు. అయితే అప్పటికే మంటలు తీవ్రంగా వ్యాపించడంతో హార్డ్‌వేర్ దుకాణంలోని వస్తువులు, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం.








