కామారెడ్డి, 4 September
జుక్కల్ సమీపంలో హైదరాబాద్-1 డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో బస్సు డ్రైవర్ అంజనేయులు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న 13 మందిలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జుక్కల్ ఎక్స్‌రోడ్ దాటి బిచ్కుంద సమీపంలో హైదరాబాద్-1 డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు (340030) ప్రమాదానికి గురైన ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి బిచ్కుంద వెళ్తున్న బస్సు మధ్యాహ్నం సమయంలో రోడ్డు పక్కనున్న డివైడర్‌ను ఢీకొని బోల్తా పడగా, బస్సు డ్రైవర్ అంజనేయులు వాహనం కింద చిక్కుకుని మృతి చెందారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని మంత్రి పేర్కొంటూ, మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.










