కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మంటలు ఎగిసిపడుతుండటంతో పలువురు కార్మికులు లోపల చిక్కుకున్నారు.
పేలుడు ధాటికి కర్మాగారం లోపల తీవ్ర నష్టం జరిగినట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో వాటిని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ దుర్ఘటనలో ఎంతమంది కార్మికులు ప్రభావితమయ్యారు, ఎటువంటి నష్టం జరిగింది అనే దానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.












