ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో విషాదం చోటుచేసుకుంది. అలీగంజ్ ప్రాంతంలోని పూర్ణియాలో ఓ కోచింగ్ సెంటర్ భవనంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటల్లో 11 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు. మరికొందరు గాయపడ్డారు.
లక్నోలోని పూర్ణియాలో ఉన్న కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫర్నిచర్ షాపులో మంటలు చెలరేగి, అవి వేగంగా పై అంతస్తులోని కోచింగ్ సెంటర్‌కు వ్యాపించాయి. దీంతో లోపల ఉన్న విద్యార్థులు ప్రాణ భయంతో అల్లాడిపోయారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కొంతమంది విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం పై నుంచి దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరికొంతమంది మంటల్లోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి, మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.









