స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనలో పది సూత్రాల అమలుపై రాష్ట్ర ప్రణాళికా విభాగం మరియు కేఆర్ఈఏ యూనివర్సిటీ సారధ్యంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ మరియు ఐఎఫ్ఎంఆర్ సంస్థ ప్రతినిధుల మధ్య జరిగింది.
రాష్ట్ర స్థూల ఉత్పత్తి మరియు వృద్ధిరేటు సాధనలో పది సూత్రాల మిషన్ సెల్స్ ఏర్పాటుతో పాటు పర్యవేక్షణపై ఐఎఫ్ఎంఆర్ పని చేయనున్నది.
జీరో పావర్టీ, వాటర్ సెక్యూరిటీ, డీప్ టెక్ మిషన్లపై కూడా శ్రద్ధ వహించనున్నారు.











