ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కొండూరు గ్రామంలో ఈతకు వెళ్లి ఒక బాలుడు మృతి చెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి వాగులో ఈత కొడుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
కొండూరు గ్రామానికి చెందిన లక్ష్మణరావు, అనూష దంపతుల పెద్ద కుమారుడు దినకరన్, స్నేహితులతో కలిసి స్థానిక కూచి వాగులో ఈత కొట్టడానికి వెళ్ళాడు. ఈత కొడుతున్న సమయంలో దినకరన్ వాగులోని ఒక గుంతలో మునిగిపోయాడు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దినకరన్ నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన అతని స్నేహితులు వెంటనే కేకలు వేసి స్థానికులను అప్రమత్తం చేశారు. స్థానికులు వెంటనే స్పందించి, దినకరన్‌ను నీటిలోంచి బయటకు తీశారు.












