యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పది మంది ప్రయాణికులు గాయపడ్డారు.
ఏపీలోని నిడదవోలు నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు, జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.












