జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, కరువు రైతాంగాన్ని ఆదుకోవాలని, పంటలు నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని ఏపీ రైతు సంఘం ప్రభుత్వాన్ని కోరింది. మంగళవారం విజయవాడలో కరువు విపత్తుల శాఖ జాయింట్ డైరెక్టర్‌కు సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.
జిల్లాలో ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, తగినంత వర్షపాతం నమోదు కాకపోవడంతో పంటల సాగు జరగలేదని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి. దస్తగిరి రెడ్డి తెలిపారు. ఇప్పటికే కరువు ఛాయలు అలుముకున్నాయని, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తక్షణమే ప్రభుత్వం కరువు పరిస్థితిని అంచనా వేసి సహాయక చర్యలు చేపట్టాలని, కరువు ప్రభావిత మండలాలలో ప్రత్యేక కరువు ప్యాకేజీ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. పంటలు నష్టపోయిన రైతులకు తక్షణ నష్టపరిహారం చెల్లించి అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.












