కామారెడ్డి, 2026-07-21
గత 40 ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూమిని తమది కాదని, బెదిరింపులకు పాల్పడుతూ, చంపేస్తామని దుష్ప్రవర్తన చేస్తున్నారని కామారెడ్డికి చెందిన మామిండ్ల లింగం, జొన్నల నర్సింలు, జొన్నల రాజశేఖర్ లపై ఇల్చిపూర్ గ్రామ శివారుకు చెందిన అన్నదమ్ములు ప్యాట్ల రమేష్, సాయిలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు అధికారులకు ఫిర్యాదు చేశారు.
గత 40 సంవత్సరాలుగా తాము సాగు చేసుకుంటున్న భూమిని తమది కాదని, బెదిరింపులకు పాల్పడుతూ, చంపేస్తామని దుష్ప్రవర్తన చేస్తున్నారని కామారెడ్డికి చెందిన మామిండ్ల లింగం, జొన్నల నర్సింలు, జొన్నల రాజశేఖర్ లపై ఇల్చిపూర్ గ్రామ శివారుకు చెందిన అన్నదమ్ములు ప్యాట్ల రమేష్, సాయిలు ఆవేదన వ్యక్తం చేశారు.
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు ఇల్చిపూర్ గ్రామ శివారులో సర్వే నంబర్ 76/1/1లో 23 గుంటల భూమి ఉందని, ఈ భూమి తమ నాన్నగారైన ప్యాట్ల లింగం గారికి 1984 సంవత్సరంలో కామారెడ్డికి చెందిన మోతే సునీల తండ్రి గంగ గౌడ్ వద్ద పదిమంది సమక్షంలో బాండ్ పేపర్ రాసిచ్చారని తెలిపారు. అప్పటినుండి ఇప్పటివరకు అదే సర్వే నంబర్ లో తాము పంటలు పండించుకుని జీవిస్తున్నామని పేర్కొన్నారు.
కావాలని మామిండ్ల లింగం, జొన్నల నర్సింలు, జొన్నల రాజశేఖర్, ప్యాట్ల శంకర్ లు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, గత 40 ఏళ్లుగా తాము ఇదే భూమిలో పంటలు పండించుకుని జీవనం కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేశామని, అధికారులు, పోలీసులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నామని అన్నదమ్ములు ప్యాట్ల రమేష్, సాయిలు తెలిపారు.











